Power Of Silence

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

అనేక రకాల మానసిక రోగములను దూరంగా తరిమికొట్టేందుకు సాధనము సైలెన్స్ శక్తి

ప్రస్తుత ప్రపంచములో మనము అందరమూ ఎదుర్కుంటున్న ముఖ్యమైన సమస్య ఒత్తిడి. ఒత్తిడి కారణముగా మనకు తెలియకుండానే మనము చాలా మానసిక రోగాలకు గురి అవుతున్నాము అన్న విషయం మనకు అందరికి తెలిసిందే . మరి మనము నాకు వున్న ఆ ఒత్తిడిని నేను ఎలా దూరం చేసుకోగలను అని ఎప్పుడు అయిన ఆలోచించామా ? అయితే ఇప్పుడు ఆలోచించండి ! ఒత్తిడి అనేది కులానికి , మతానికి లేక పేద మరియు ధనిక వర్గానికి సంభందిచినదా ? అది ఏ మాత్రమూ ఒక్కరికే  సంబంధించినది కాదు అని కూడా మన అందరికి తెలుసు ! విశ్వంలో జన్మ తీసుకున్న ప్రతి మనిషి ఈ రోజు ఒత్తిడి అనే దానికి సహజముగానే గురి అవుతున్నారు .  అలా ఎందుకు జరుగుతుంది  అన్న ప్రశ్న మీకు ఎవరికైనా వచ్చిందా ! నాకు అయితే వచ్చింది . చాలా మంది అనుకుంటారు జీవితంలో వారికి మాత్రమే ఒత్తిడి వుంది . వేరొకరి జీవితం హాయిగా వుంది అని. అలా అనుకోవటం చాల పరపాటు . అందరి జీవితములు ఎప్పుడు ఒకేలా వుండవు . ఉదాహరణకు మనము సాధారణముగా ఏమి అనుకుంటాము అంటే డబ్బులు వుంటే ఈ ప్రపంచములో అసలు ఒత్తిడి వుండదు . చాల హాయిగా బ్రతికేయ వచ్చు అని . కాని ఒక్కసారి మీకు వున్న సమస్యలను పక్కకు పెట్టి అది ఎంత వరుకు నిజం అని ఆలోచించి చూస్తే , అప్పుడు మీకే అర్ధం అవుతుంది . ఒక్కసారి మనము సత్యాన్ని చూద్దాం . డబ్బులు వున్న వాళ్ళు అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారా అని ? లేదు వాళ్ళు ప్రశాంతమైన నిద్రను పొందలేరు . ఎందుకు అంటే వాళ్ళ మనస్సు ఎప్పుడు డబ్బుల వైపు  పరుగు పెడుతుంది . సంపాదించే కొద్ది ఇంకా సంపాదించాలి అన్న ఆశ పెరిగిపోతూనే వుంటుంది  . అంతే కాదు నా ఆస్తిని ఎవరు ఎప్పుడు కొట్టేస్తారు . ఎవరికి ఇవ్వాలి , ఎవరికి ఇవ్వకూడదు , ఎప్పుడు ఇవ్వాలి , ఎప్పుడు ఇవ్వకూడదు , ఎంత ఇవ్వాలి ఈ ఆలోచనలతోనే శాంతిగా వున్నాము అని అనుకుంటూ అశాంతిగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. దాని వలన మనకు తెలియకుండానే చాల రకాలుగా మనోవ్యాధికి గురి అవుతూ , అశాంతిగా బ్రతికేస్తున్నారు .ఒకొక్కసారి వాళ్ళకు వున్న డబ్బు ఏమి చేసుకోవాలో తెలియక విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ , వ్యసనాలకు బానిసలుగా అయిపోతున్నారు. వారి ఆరోగ్యమును పాడు చేసుకుంటున్నారు . అంతే కాకుండా ఇంట్లో వాళ్ళను మనో వ్యాధికి గురిచేస్తున్నారు . పెద్ద వాళ్ళను చూసి పిల్లలు కూడా అలానే తయారు అవుతున్నారు . డబ్బు అనేది వాస్తవిక ప్రపంచoలో ఒక మాయ అని పుట్టకతో మనము ఏమి తెచ్చుకోము . మరణముతో వున్న డబ్బులో నుంచి ఒక పైసా కూడా మనతో తీసుకుపోము అన్న సత్యాన్ని మనము అందరము ఎప్పుడు గుర్తిస్తామో ? ఏమిటో ?  ఇప్పుడు అందరు అనుకోవచ్చు బ్రతకటానికి డబ్బు కావాలి కదా అని ! బ్రతకటానికి సంపాదించాలి కాని సంపాదన కోసమే బ్రతక కూడదు .ఇక్కడ ఎవరి కర్మలను బట్టి వారికి సంపాదన యోగము వుంటుంది అని కూడా గ్రహించుకోవాలి . నిజమైన ధనవంతుడు ఎవరు అన్న ప్రశ్నను మనకు మనమే వేసుకుంటే ఎవరు అయితే మంచి సంస్కరములతో మరియు మంచి నడవడికతో , దయ , క్షమా గుణాలు కలిగి మానవత్వ విలువలను కలిగి ఎవరు అయితే వుంటారో వారు నిజమైన ధనవంతులు మరియు విశ్వనికి మహారాజులు. అంతే కాని కేవలము డబ్బు వుంటే ధనవంతులు. డబ్బు లేకపొతే పేదవారు అని అనటం సమజసం కాదు . వ్యక్తిత్వమును బట్టి మనిషి ధనవంతులు మరియు పేద వారు అవుతారు అన్నది నగ్న సత్యం .కాని ఎంత వరుకు మనము దానిని అంగికరిస్తున్నాము . మన మందరము ప్రస్తుత సమాజములో డబ్బు సంపాదించాలి అనే వ్యామోహంలో పడి మనిషి సుఖానికి దగ్గర అవుతున్నారు అని అనుకుంటూ తనకు తెలియకుండానే అనేక రకాల మానసిక వ్యాధులకు గురి అవుతున్నారు . ఒక్క సారి ఆలోచించి చూడండి ఏ ఇంటిని తీసుకున్నా ఎవరిని కదిపినా సమస్య దేనితో మొదలు అంటే డబ్బు. ఉదాహరణకు భార్య – భర్తల మధ్య ఈ రోజుల్లో ఎక్కువగా సమస్యలు ఎందుకు వస్తున్నాయి ? అని ఆలోచించి చుస్తే ముఖ్యముగా  డబ్బు . చాలా మంది చదువుకుని కూడా అజ్ఞానిగా ప్రవర్తిస్తున్నారు . సర్దుకునే తత్వాన్ని మర్చిపోయి . ఏది అయిన గొడవ వస్తే చాలు నువ్వేనా సంపాదిస్తుంది నేను కూడా సంపాదిస్తున్నాను అన్న అహంకారముతో గోటితో పోయే గొడవను గొడ్డలి వరుకు తీసుకువెళ్ళుతూ , కొన్ని సందర్బాలలో విడాకుల వరుకు కూడా వెళ్ళిపోతూ వున్న శాంతిని కోల్పోయి అశాంతి జీవితంలోకి వెళ్ళిపోతూ , మానసిక రోగములను ఆహ్వానిస్తున్నారు . ఇంకొక  ఉదాహరణ తీసుకుందాము డబ్బు అందరికి అవసరమే కాని ఈ రోజుల్లో ఎంత మంది న్యాయముగా సంపాదిస్తున్నారు చెప్పండి ?  ఎప్పుడు ఎవరిని మోసం చేద్దాం అని మాత్రమే ఆలోచిస్తూ దొరికిన ప్రతి వాడి దగ్గర నుంచి అన్యాయ మార్గములో చాల డబ్బులు  సంపాదిస్తున్నారు . అలా సంపాదించి నప్పుడు అయినా  మనము ప్రశాంతంగా జీవించ గలుగుతున్నామా ? అంటే ఎప్పుడు ఎదో ఒక మానసిక ఒత్తిడికి గురి అవుతూనే వున్నాడు . ఆశకు అంతు లేదు అన్నట్టు ఇంకా సంపాదించాలి అని మనిషి జీవిత పయనాన్ని  డబ్బు డబ్బు అనే నామాన్ని స్మరిస్తూ తన పరుగులను ఎటు తీసుకువెళ్ళుతున్నాడు అని మాత్రం ఆలోచించుకోవటం లేదు . చాలా మంది మానసిక ఒత్తిడికి గురి కావటం వల్లనే దొంగతనాలకు , హత్యలు చేసి కూడా డబ్బులు సంపాదించాలని అని అనుకుంటున్నారు .కొంతమంది డబ్బులు సంపాదించాలి అని తప్పన మరియు మానసిక ఒత్తిడితో తన శరీరాన్ని అమ్ముకుంటున్నారు . విద్యార్ధులు చాలా మంది చదువుకుంటున్న సమయం నుంచి మానసిక ఒత్తిడికి గురి అవుతూ వాటి నుంచి బయట పడటానికి ఏమి చెయ్యాలో తెలియక చెడు సావాసాలకు అలవాటు పడుతూ పక్క దారిలో   డబ్బు సంపాదించాలి అని  ప్రయత్నం చేస్తున్నారు. దాని వలన యువత ఏమి కోల్పోతుంది . మనిషి ఎందుకు ఇంత అరాచకంగా మారి పోతున్నాడు అని ఎప్పుడు అయిన ఆలోచించారా ? ఎక్కడ చూసినా సమాజము అంధకారo అనే చీకటిలోకి ఎందుకు వెళ్ళిపోతుంది . మనిషికి ఏమి కావాలి అని బ్రతుకుతున్నాడు ? అసలు వెలుగులోకి వెళ్ళాలి అని అనుకుంటున్నడా లేక చీకటిలోకి వెళ్ళాలి అనుకుంటున్నడా ? ఈ ప్రశ్నలను ఒక్క సారి మనకు మనము వేసుకుంటే మనకు అర్ధం అవుతుంది చాలా పిచ్చి వాడిగా మనిషి తన జీవితాన్ని గడుపుతున్నాడు అని . గాలిలో మేడలు కడుతూ కొంత మంది , సత్యానికి – అసత్యానికి తేడా తెలియక కొంత మంది , ప్రతి మనిషి జీవితానికి పుట్టుకకు ఒక కారణం వుంటుంది అని తెలుసుకోలేక తిక మక పడుతూ ఎందుకు వచ్చిన జీవితంరా బాబు అని అనుకుంటూ బ్రతికేసే వాళ్ళు చాల మంది వున్నారు . ప్రపంచం మొత్తం చాల వరుకు తమ జీవితాలను సార్ధకత చేసుకోవటం తెలియక వృధాగా జీవిత సమయాన్ని అసంతృప్తితో గడిపేస్తూ పూర్తిగా అశాంతికి లోను అయ్యి వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నారు . సమస్యలు లేని మనిషి వుండరు . మరి మన యొక్క మానసిక ఒత్తిడి నుంచి బయట పడాలి అంటే మనము ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా ? లేదా ?  అయితే ఇప్పుడు ఆలోచించటం మొదలు పెడుతున్నారా ? స్వ చింతన ఉన్నతికి సోపానం పరచంతన పతనానికి నాంది అన్న దానిని దృష్టి లో పెట్టుకుని . మనము మన సమస్యల నుంచి ఎలా బయటకు రాగలము అని ఎవరికి వారే ఆలోచించుకుందాము . స్వ అంటేనే స్వయం కోసం అంటే మీ కోసం అని అర్ధం. 


The power of silence is a powerful practice to drive away many kinds of mental illnesses

In today’s world, the major problem we all are facing is stress. Due to stress, knowingly or unknowingly, we are becoming victims of many mental disorders—this is something we are all aware of.

But have we ever truly thought about how we can remove this stress from our lives?

Now is the time to think!

Is stress related to caste, religion, or whether someone is rich or poor?
No, it is not limited to any one group. Every human being born into this universe naturally experiences stress.

Have you ever wondered why this happens?

Many people feel that only their life is full of stress and that others are living happily. This is a big misconception. No one’s life is the same all the time.

For example, we often think that if we have money, there will be no stress and life will be very comfortable. But if we truly reflect on reality, we understand that this is not true.

Are all wealthy people sleeping peacefully?
No. Their minds are constantly running behind money. The more they earn, the more they desire. Thoughts like:

  • Who might take my wealth?
  • To whom should I give?
  • When should I give?
  • How much should I give?

These thoughts create unrest, even when they believe they are living peacefully.

Without realizing it, they fall into mental disturbances. Sometimes, not knowing how to use their wealth, they spend recklessly, become addicted to harmful habits, damage their health, and even affect their families. Children often follow the same path by observing elders.

Money in the material world is an illusion.
We bring nothing when we are born, and we take nothing when we die—not even a single coin.

When will we truly realize this truth?

Yes, money is necessary for living.
But we should earn to live—not live only to earn.

We must understand that income and opportunities come according to one’s karma.

So who is a truly rich person?

A person who has:

  • good values,
  • good character,
  • compassion,
  • forgiveness,
  • and humanity

Such a person is truly wealthy and a king in this universe.

Not someone who only has money.

Wealth and poverty are not defined by money, but by one’s character—this is the ultimate truth. But how much are we accepting it?

In today’s society, people are trapped in the obsession of earning money, thinking it brings happiness, but unknowingly inviting mental illnesses into their lives.

Look around—many problems in families start with money.

For example, why are conflicts increasing between husband and wife today?
The main reason is often money. Even educated people behave ignorantly, forgetting adjustment and understanding.

Small issues grow into big conflicts due to ego:
“You earn? I also earn!”

Such ego leads to serious fights and sometimes even divorce, resulting in loss of peace and mental distress.

Another example:
Money is necessary, but how many people earn it honestly today?

Many think about how to cheat others and earn money through unfair means. But even then, do they live peacefully? No—they remain under constant stress.

Human desires have no end. In the race for money, people forget to reflect on where their life is heading.

Due to mental stress:

  • some resort to theft and crime,
  • some even commit murder,
  • some sell their bodies,
  • students fall into bad habits and wrong paths.

What is happening to our youth?

Have we ever truly thought:

  • Why is humanity becoming so chaotic?
  • Why is society moving towards darkness?
  • What does a human really want?
  • Are we moving towards light or darkness?

If we ask ourselves these questions, we realize how blindly we are living.

Many people:

  • build castles in the air,
  • fail to distinguish truth from falsehood,
  • don’t understand the purpose of life,
  • and live in confusion, wondering why they are even alive.

Most of the world is living without purpose, wasting time in dissatisfaction, falling into addictions, and becoming mentally disturbed.

There is no human without problems.

So, what should we do to overcome mental stress?

Are you thinking about it now?

Then start thinking!

“Self-thinking leads to growth, while overthinking about others leads to downfall.”

Focus on self-reflection.

“Self” means for yourself.

Let each of us think about how we can come out of our own problems.


मौन की शक्ति अनेक प्रकार की मानसिक बीमारियों को दूर करने का एक शक्तिशाली साधन है।

आज की दुनिया में हम सभी जिस सबसे बड़ी समस्या का सामना कर रहे हैं, वह है तनाव। तनाव के कारण, जाने-अनजाने में हम कई मानसिक रोगों के शिकार बनते जा रहे हैं—यह बात हम सभी जानते हैं।

लेकिन क्या हमने कभी सच में यह सोचा है कि इस तनाव को अपने जीवन से कैसे दूर करें?

अब सोचने का समय है!

क्या तनाव जाति, धर्म, अमीर या गरीब से जुड़ा हुआ है?
नहीं, यह किसी एक व्यक्ति या वर्ग तक सीमित नहीं है। इस सृष्टि में जन्म लेने वाला हर इंसान स्वाभाविक रूप से तनाव का सामना करता है।

क्या आपने कभी सोचा है कि ऐसा क्यों होता है?

बहुत से लोग सोचते हैं कि केवल उनके जीवन में ही तनाव है और दूसरों का जीवन बहुत सुखी है। यह एक बड़ी गलतफहमी है। किसी का भी जीवन हमेशा एक जैसा नहीं होता।

उदाहरण के लिए, हम अक्सर सोचते हैं कि अगर हमारे पास पैसा हो तो कोई तनाव नहीं रहेगा और जीवन बहुत सुखी होगा। लेकिन अगर हम सच्चाई को समझने की कोशिश करें, तो पता चलता है कि यह सही नहीं है।

क्या सभी अमीर लोग चैन से सोते हैं?
नहीं। उनका मन हमेशा पैसे के पीछे भागता रहता है। जितना अधिक कमाते हैं, उतनी ही अधिक इच्छाएं बढ़ती जाती हैं। उनके मन में ऐसे विचार चलते रहते हैं:

  • मेरा पैसा कौन ले जाएगा?
  • मुझे किसे देना चाहिए?
  • कब देना चाहिए?
  • कितना देना चाहिए?

ये सभी विचार उनके मन में अशांति पैदा करते हैं, भले ही वे खुद को शांत समझते हों।

अनजाने में वे मानसिक अशांति का शिकार हो जाते हैं। कभी-कभी वे अपने पैसे का सही उपयोग नहीं कर पाते, फिजूल खर्च करते हैं, बुरी आदतों के शिकार हो जाते हैं, अपने स्वास्थ्य को नुकसान पहुंचाते हैं और अपने परिवार को भी प्रभावित करते हैं। बच्चे भी बड़ों को देखकर वैसा ही सीखते हैं।

भौतिक संसार में पैसा एक माया है।
हम जन्म के समय कुछ नहीं लाते, और मृत्यु के समय कुछ भी साथ नहीं ले जाते—एक पैसा भी नहीं।

हम इस सच्चाई को कब समझेंगे?

हाँ, जीवन जीने के लिए पैसा जरूरी है।
लेकिन हमें जीने के लिए कमाना चाहिए, केवल कमाने के लिए नहीं जीना चाहिए।

हमें यह भी समझना चाहिए कि आय और अवसर हमारे कर्मों के अनुसार मिलते हैं।

तो असली अमीर कौन है?

वह व्यक्ति जिसके पास:

  • अच्छे संस्कार,
  • अच्छा चरित्र,
  • दया,
  • क्षमा,
  • और मानवता हो

वही वास्तव में सच्चा धनी है और इस संसार का सच्चा राजा है।

सिर्फ पैसे वाला व्यक्ति धनी नहीं होता।

धन और गरीबी पैसे से नहीं, बल्कि व्यक्ति के चरित्र से तय होती है—यह एक नग्न सत्य है। लेकिन हम इसे कितना स्वीकार कर रहे हैं?

आज के समाज में लोग पैसा कमाने की दौड़ में फंसे हुए हैं, यह सोचकर कि इससे सुख मिलेगा, लेकिन अनजाने में वे मानसिक रोगों को आमंत्रित कर रहे हैं।

चारों ओर देखें—अधिकतर पारिवारिक समस्याएं पैसे से ही शुरू होती हैं।

उदाहरण के लिए, आज पति-पत्नी के बीच झगड़े क्यों बढ़ रहे हैं?
मुख्य कारण पैसा ही होता है। पढ़े-लिखे लोग भी समझदारी खोकर अहंकार में आ जाते हैं।

छोटी-छोटी बातें अहंकार के कारण बड़ी बन जाती हैं:
“तुम कमाते हो? मैं भी कमाती हूँ!”

ऐसा अहंकार बड़े झगड़ों और कभी-कभी तलाक तक पहुंचा देता है, जिससे शांति खत्म होकर मानसिक तनाव बढ़ जाता है।

एक और उदाहरण:
पैसा जरूरी है, लेकिन आज कितने लोग उसे ईमानदारी से कमाते हैं?

बहुत से लोग दूसरों को धोखा देकर गलत तरीकों से पैसा कमाने के बारे में सोचते हैं। लेकिन क्या वे शांति से जी पाते हैं? नहीं—वे हमेशा तनाव में रहते हैं।

इंसान की इच्छाओं का कोई अंत नहीं है। पैसे की दौड़ में इंसान यह भूल जाता है कि उसका जीवन किस दिशा में जा रहा है।

मानसिक तनाव के कारण:

  • कुछ लोग चोरी और अपराध की ओर बढ़ते हैं,
  • कुछ हत्या तक कर देते हैं,
  • कुछ अपने शरीर का व्यापार करते हैं,
  • छात्र बुरी संगत में पड़ जाते हैं और गलत रास्ते चुन लेते हैं।

हमारी युवा पीढ़ी के साथ क्या हो रहा है?

क्या हमने कभी सोचा है:

  • मानवता इतनी अराजक क्यों हो रही है?
  • समाज अंधकार की ओर क्यों बढ़ रहा है?
  • इंसान वास्तव में क्या चाहता है?
  • हम प्रकाश की ओर जा रहे हैं या अंधकार की ओर?

जब हम खुद से ये प्रश्न पूछते हैं, तब हमें एहसास होता है कि हम कितनी अंधी तरह से जीवन जी रहे हैं।

बहुत से लोग:

  • हवा में महल बना रहे हैं,
  • सत्य और असत्य में फर्क नहीं समझ पा रहे,
  • जीवन का उद्देश्य नहीं जानते,
  • और भ्रम में जीते हुए यह सोचते हैं कि वे क्यों जीवित हैं।

दुनिया के अधिकांश लोग बिना उद्देश्य के जीवन जी रहे हैं, असंतोष में समय बर्बाद कर रहे हैं, नशे की लत में फंस रहे हैं और मानसिक रूप से परेशान हो रहे हैं।

ऐसा कोई इंसान नहीं है जिसके जीवन में समस्या न हो।

तो फिर मानसिक तनाव से बाहर निकलने के लिए हमें क्या करना चाहिए?

क्या आप अब इसके बारे में सोच रहे हैं?

तो सोच शुरू कीजिए!

“स्वयं के बारे में सोच (स्व-चिंतन) उन्नति की ओर ले जाता है, जबकि दूसरों के बारे में अधिक सोच पतन की शुरुआत है।”

स्व-चिंतन पर ध्यान दें।

“स्व” का अर्थ है—अपने लिए।

आइए हम सब मिलकर यह सोचें कि हम अपनी समस्याओं से कैसे बाहर निकल सकते हैं।