By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
Scroll down for English version
మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి రోజు చేసుకోవలసిన సాధన

ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మీ ఆరోగ్యం మీ చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.
నేను జీవాత్మను. ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. ఆ శాంతిని పొంధటానికి, నేను బిందు స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో బీజ సంపన్నముగా వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి , ప్రేమ, ఆనందం , పవిత్రత , జ్ఞానము, శక్తి , సుఖ వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి ,శక్తి, ఆనంద , పవిత్రత , జ్ఞానము, ప్రేమ , సుఖ సంపన్న జీవాత్మగా మారిపోతున్నాను. విశ్వానికి శాంతి ,శక్తి, ఆనంద , పవిత్రత , జ్ఞానము, ప్రేమ , సుఖ వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. నా చుట్టూ ప్రకాశమే ప్రకాశం. నేను ఫరిస్తా సంపన్నమైన అనుభవాన్ని పొందుతున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్య స్టితిని ని పొందుతున్నాను. సతో ప్రధాన స్టితిని పొందుతున్నాను. నేను స్వరాజ్య అధికారి జీవాత్మ గా మారిపోతున్నాను. నా కర్మేద్రియాలు నా అధీనంలో వున్నాయి.నేను తిరిగి నా జీవిత పయనాన్ని కొన సాగించడానికి తండ్రి జతలో నేను వున్నాను. నా జతలో తండ్రి వున్నారు అని అనుకుoటు, బృకుటి స్థానం లోకి తిరిగి ప్రవేశిస్తున్నాను.
ఈ విధంగా రోజు యోగం చేసుకోండి. మీలో వచ్చే మార్పు మీరే చూసుకోండి.
రోజు నిద్ర పోయే ముందు తండ్రి పరమాత్మ ఒడిలో తల పెట్టుకుని పోడుకోండి.
ఓం శాంతి ! ఓం నేను జీవాత్మను ! ఆత్మ స్వధర్మం శాంతి.
నా గమ్యం పరంధామం : గీత ఆధారంగా అక్షర బ్రహ్మ యోగం 21 వ శ్లోకం.
Do daily Mediation to create your Spiritual Power
Wherever they are, they can sit there calmly and even sit in a chair. Make your place the home of the Supreme and do yoga. Your home is your temple. Your body is the temple of your soul. You don’t need to go to any spiritual centers. I – my father, thinking that he is the Supreme Lord, take the hand of the Supreme Lord and look at it. Don’t wait for someone to come and save me. Trust no one. Believe in yourself. Your health is in your hands.
Will: Every living soul in this creation must become spiritual self-doctors to save whomever they can. Everyone should do whatever they can to run towards our ultimate goal regardless of religion.
I am the soul. The dynamic energy that drives this body. I am shining in Bhrukuti Sthana. Self-righteousness is peace. To attain that peace, I experience the form of Bindu. For a while I was in a state of ‘asharira’, beyond the body, in the womb, in the presence of the Supreme Being, rich in seeds. I feel the peace of God. Rays of peace, love, joy, purity, wisdom, power and bliss are radiating from the Supreme Soul to my innermost place. I am becoming a soul full of peace, power, joy, holiness, knowledge, love and happiness. I am spreading rays of peace, power, joy, holiness, knowledge, love and happiness to the universe. All around me is brightness. I am enjoying the rich experience of Farista. I am enjoying perfect health status. Sato is getting the main status. I am becoming the living soul of Swarajya Adhikari. My karmas are under me. I am in the father’s company to resume my life’s journey. I feel that my father is in my pair, and I am re-entering the Bhrukuti position. Do meditation daily in this way. See the change in yourself.
Before going to sleep, rest your head on the lap of the Father. Om Shanti ( peace ) ! Om does mean I am the soul! Self-righteousness is peace.
My destination is Parandham : Akshara Brahma Yoga 21st sloka based on Gita.