Purusharth Key Points

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

నేను నా పురుషార్ధం కోసం గుర్తు పెట్టుకున్న విషయాలను వ్రాస్తున్నాను. దీనితో మన పురుషార్ధంను ముందుకు తీసుకువెళ్లవచ్చు.

1. సదా సాక్షి స్థితిని ధారణ చెయ్యాలి . సాక్షి అనగానే మనకు ఈ రెండు అక్షరాలలో ధర్మ రహస్యము మరియు ఆనంద రహస్యము దాగి వున్నాయి అని గుర్తుకు  రావాలి .

2. నేను నిమిత్తం అనే భావనయే  మన పురుషార్ధంను ముందుకు తీసుకువెళ్ళుతుంది.

3. నేను ఆత్మను  అని ఎక్కువ సార్లు వ్రాసుకోవడం చేసుకుoటే మనము తప్పక అత్మిక స్థితిని పొందగలము . బ్రహ్మ బాబా కూడా మొదటిలో నేను ఆత్మను అని వ్రాసుకునేవారు .

4. ఫాలో ఫాదర్ అనే దానిని మరిచిపోకూడదు .

5. నేను – నా బాబా అనే మాట తప్ప వేరే ఏ ఇతర మాటలను మన బుద్ధిలో వుంచుకోకూడదు .

6. శ్రీమతంను అనుసరించాలి . శ్రేష్ఠమైన బుధ్ధిని కలిగివుండటం . సాకారములో నిమిత్తముగా మనకు వున్న టీచర్ లో ఎలాగా అయితే మామ్మ నిరాకారుడను చుసేవారో, అలాగే మనము కూడా తయారు అవ్వటానికి ప్రయత్నo చెయ్యాలి .

7. మనసా సేవ మరియు మన స్థితిని పెంచుకునే దాని పై మన ధ్యాసను కేంద్రికృతము చెయ్యాలి .

8. డ్రామాలో అలసిపోయి ఆగిపోయే వాళ్ళు కనిపిస్తారు , వారిని చూసి మనము ఆగిపోకూడదు. కొంత మంది మనలను దాటుకుని వెళ్ళిపోవటం మనకు కనబడుతుంది . వారిని చూసి కూడా బాధ పడకూడదు. స్వచింతనతో మెట్టు ఎక్కుతూ వెళ్లిపోవాలి . పరచింతన చేస్తూ మెట్టు దిగకూడదు .

9. సమయం దగ్గరకు వచ్చేసింది . మన జీవిత లక్ష్యాన్ని ఇంటికి తిరిగి వెళ్ళలి అన్న దాని పై వుంచాలి .

10.  ఎప్పుడు ఎవర్ రెడీగా వుండాలి .

11.  ఎవరి పాత్ర వారిది . ఒకరి పాత్ర ఒకరు పోషించలేరు అన్న విషయాన్ని గ్రహించుకుంటు డ్రామా అనే డాలును, జ్ఞాన – యోగం అనే ఖడ్గమును  చేతపట్టుకుని ముందుకు సాగాలి .

12.   తండ్రి ఫై నిశ్చయబుద్ధితో వుండాలి .

13.  ఏకరస స్థితి మరియు ఏకాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి .

14.  ధనము ఎక్కువగా వస్తూ  వుంటే మాయ వచ్చేస్తుంది . దాని వలన తండ్రి వారసత్వమును పొందలేము . అందుకే వున్న దానిలో తృప్తిని పొందటానికి ప్రయత్నo చేయండి .వినాశి ధనము గురించి పరుగులు తీయకూడదు .  అవినాశి జ్ఞాన సంపాదన కోసము పరుగులు తీయ్యలి .

15.  నేను అనేది ఏమి లేదు . నేను అనేది బిందువు , పరమాత్మ బిందువే , డ్రామా కూడా బిందువే అనే సత్యాన్ని సదా మన బుద్ధిలో దృఢంగా కూర్చో పెట్టుకోవాలి.

16.  ప్రకృతి ఆటను రెందు మాటలుగా గుర్తు పెట్టుకోవాలి . 1 ఒకటి బిందువుగా 2. రెండవది లైట్ అనగా జ్యోతిగా

17.  బాబా ఎవరికీ ఇచ్చిన హోం వర్క్ వారు పూర్తి చెయ్యడానికి ధ్యాస వుంచండి . వాటిని పూర్తి చెయ్యండి . పక్క వారి హోం వర్క్ గురించి ఆలోచించకండి . మనది మనము పూర్తి చేసుకోవాలి .

18.  బృహిటి సింహానాధికారిగా శరీరము నుంచి వేరుగా అయ్యే అశరీర స్థితిని అభ్యాసం చెయ్యండి .

19.  మాయాజీత్ స్వరూపాన్ని ధారణ లో ఎక్కువగా చెయ్యాలి  .

20.  నేను శరీరాన్ని కాదు . చైతన్యవంతమైన శక్తిని అవినాశి ఆత్మను అన్న దానిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆశరిర స్థితిని అభ్యాసం చెయ్యాలి .

21.  ఆత్మను సంతుష్టముగా  చేసుకోవాలి. అది జరగక పోతే యోగము కుదరదు అని తెలుసుకోండి .సదా స్వయాన్ని సంతుష్ట ఆత్మగా అనుభవము చేయ్యoడి. జ్ఞాని – యోగీ ఆత్మల గుర్తు సంతుష్టత అని మర్చిపోకండి .

22.  నేనే లోక వినాశకుడను / విశ్వ కళ్యాణ కారి ఆత్మను అన్న స్థితిలో స్థితమై వుండాలి .

23.  మన దృషి ద్వారా అందరికి పరమాత్మ యొక్క సందేశం అందే విధముగా ధారణ చేయటం .

24.  నా సర్వ సంభందములను శివ పరమాత్మతోనే జోడించాలి .

25.  నథింగ్ న్యూ అని గ్రహించుకుని వహ్ డ్రామా , వహ్హ బాబా , వహ్హ నేను , వహ్హ నా భాగ్యము అనే దానిని ప్రతి సంఘటనలో గుర్తుపెట్టు కోవాలి .

26.  అచోల్ ఆడోల్ స్థితినిలో స్థితులై వుండాలి .

27.  తపస్యా సంవత్సరం అనగా తీవ్ర పురుషార్ధం చెయ్యాలి . తపస్సు అంటే సంతుష్టతకు రూపము . దృష్టిలో, వృత్తిలో  , ముఖంలో నడవడికలో కనిపించాలి . అలా మనము తయారు అయ్యామా లేదా అని చెక్ చేసుకోవాలి . సంతుష్ట మని అనగా మచ్చ లేని మణి అని అర్ధం . అందరమూ మన పురుషార్ధంను సంతుష్ట మణిగా అయ్యేందుకు కొనసాగించాలి.

28.  కంట్రోలింగ్ పవర్ ను , రూలింగ్ పవర్ తగ్గకుండా వుండాలి అంటే 3 శబ్దంములు అయిన ఏమిటి ? ఎందుకు ? కావాలి అనే వాటిని సమాప్తం చేసుకోవాలి అన్న విషయాన్ని గ్రహించుకోవాలి .

29.  సంతుష్టతలో స్వచ్చత ఎంత వుంది అని రోజులో చెక్ చేసుకోవాలి . ఇక్కడ 3 ప్రాకారాల ఆత్మల సంభందము గురించి ఆలోచించాలి . 1 ) బ్రహ్మణ పరివరములోని ఆత్మలు 2 ) మీ వద్దకు వచ్చే జిజ్ఞాసు ఆత్మలు 3. ) లౌకిక పరివారములోని ఆత్మలు

30.  సదా స్వయాన్ని నిశ్చయ బుద్ధి, విజయి ఆత్మగా అనుభవము చెయ్యటం . మూడు నిశ్చయాలు జత జత లో వుండేటట్టు చూసుకోవాలి అవి తండ్రి , మీరు , డ్రామా . ఎప్పుడు అయితే నిశ్చయ బుద్ధితో వుంటారో వారే విజయీ ఆత్మలు .

31.  బాబా పిల్లలకు ఎప్పుడు బోధిస్తూన్న నిరాకారి, నిర్వికారి , నిరహంకారి స్థితిలో స్థితము అవ్వటానికి ప్రయత్నo చెయ్యాలి .

32.  బ్రహ్మ బాబా తన ప్రతి పిల్లల ముఖము ఫై చూడాలని అవుకుంటున్న రెండు విషయాలను మనము ధారణ సదా చెయ్యాలి .అవి ఒకటి – సదా ఆత్మిక చిరునవ్వు , రెండవది – నోటి ద్వారా సదా మధురమయిన మాటలు వినాలని అనుకుంటున్నారు .

33.  సర్వుల పై సదా శుభ భావన , శుభ చింతన , శుభ కామననే వుంచటం వలన పురుషార్ధం ముందుకు సాగుతుంది .

34.  మన ఆత్మ కోల్పోయిన అష్ట శక్తులను ,దివ్య గుణాలను , పదహారు కళలను నింపుకోవటానికి ప్రయత్నo చేయటం వలన .

35.  జ్వాలాముఖి స్వరూపంలో నేను అనే దానిని కూడా ఆహుతి చేసుకోవడానికి ప్రయత్నం చేయటము .

36.  రోజులో ఎక్కువ సమయం అంతర్ముఖంగా వుండటానికి ప్రయత్నం చేయటం .

37.  బాబా పిల్లలకు మెడలో జ్ఞాన , గుణాల మాలను ఏదయితే వేసారో దానిని మాత్రమే సదా ధరించి వుండాలి . ఏ ఇతర మాలను తిప్ప రాదు .

38.   స్మృతిలో కూర్చున్నప్పుడు సైలెన్స్ ద్వారా శక్తి లభిస్తే వున్నది అని అనుభవము అవుతుంది .

39.  యోగి జీవితంలో వున్న మూడు సర్టిఫికెట్లు మనము పొందామా లేదా అని చెక్ చేసుకోవాలి . 1. స్వయం సంతుష్టత 2. తండ్రి సంతుష్టత 3. లౌకిక – అలోకిక్ పరివారముతో సంతుష్టత. ఈ మూడు సర్టిఫికెట్ ఎప్పుడు ప్రాప్తిని పొందుతామో వారిని సంతుష్ట మణులని అంటారు .

40.  వ్యక్త రూపంలో వుంటూ  అవ్యక్త స్థితిని ధారణ చెయ్యాలి .

41.  ప్రత్యక్ష ఫలాన్ని భుజించటం ధారణ చెయ్యాలి అంటే మన మనస్సు , బుద్ధి ద్వారా సదా ఆరోగ్యంగా వుండటం . ఎవర్ హెల్త్ , ఎవర్ వెల్త్ , ఎవర్ హ్యాపీ స్థితిని పొందటం .

42.  నాలుగు ప్రాకారాలలో నిశ్చయమును కలిగి వుండటానికి మన స్థితిని ఏర్పాటు చేసుకోవాలి . అవి తండ్రిలో , స్వయంలో , డ్రామాలో మరియు బ్రాహ్మణ పరివారములో .

43.  విశ్వ మహారాజులుగా అవ్వటానికి దాట వలసిన మూడు స్థితులను ధారణ చెయ్యాలి . 1. ఒక్క సెకండ్లో అనంతమైన త్యాగులుగా అవ్వాలి . 2. అనంతమైన నిరంతర అలసిపోని సేవాధారులు 3. అనంతమైన వైరాగ్యులు. ఈ ముడింటిని దాటిన వారే విశ్వమహా రాజులు అవుతారు .

44.  ప్రతి సమయములో ఆకాల సింహాసనాధికారిగా , అకాల మూర్తిగా తయారు అవ్వటానికి ప్రయత్నం చెయ్యాలి.

45.  సంకల్పం చేసేటప్పుడు చాల జాగ్రతగా ఆలోచించి , సంకల్పాలను కళ్యాణ కారిగా అయ్యే విధముగా చెయ్యాలి.

46.  ఎవరు అయిన తిట్టినా , అవమాన పరిచినా మనము మన స్థితిలో సెట్ అయిపోయి .నమ్రత అనే కవచమును ధరించి వుంచాలి .

47.   జ్ఞానము , యోగం , ధారణ , సేవ అనే నాలుగు సబ్జెక్ట్స్ ను సమానముగా తయారుచేసుకోవాలి .

48.  అమృతవేళలో డ్రామా అనుసారముగా పరంధమములోకి / సుక్ష్మవతనము లోకి / సాకారoలోకి వెళ్ళి వస్తూ వుండే అభ్యాసం చెయ్యాలి .

49.  లైట్ – మైట్ హౌస్ గా మారిపోవటం ధారణ చెయ్యటం వలన మన స్థితిని పెంచుకోవచ్చు .

50.  ఎదుర్కొనే శక్తిని మాయను జయించటంలో ఉపయోగించాలి కాని పరివారాన్ని ఎదుర్కొవటానికి ఉపయోగిస్తే పురుషార్ధం వెన్నక్కు వెళ్ళుతుంది .

51.  సరళత , సహనశీలతను రెండింటిని సమపాళ్ళలో మనలో వున్నాయా లేదా చెక్ చేసుకోవాలి .

52.  యోగం ఎందుకు కుదరటం లేదో  సుక్ష్మముగా వున్న విషయాలను గ్రహించుకుని మన బలహేనతను తొలిగించుకోవడానికి తండ్రి స్మృతితో శక్తిని నింపుకోవటం వలన పురుషార్ధం ముందుకు వెళ్ళుతుంది . 

53.  బ్రహ్మ , విష్ణు , శంకర స్వరూపాలను మన ఆత్మలో నింపుకుని ధారణ 3 స్వరూపాలతో చేసుకోవాలి . బ్రహ్మ స్వరూపములో మన ఆత్మ రచనను మనమే చేసుకోవాలి . విష్ణు స్వరూపములో ఆత్మ యొక్క పాలనను తయారు చేసుకోవాలి . శంకరుని స్వరూపములో మన ఆత్మలో వున్న పంచ వికారములను సమాప్తం చేసుకోవాలి . అప్పుడే మన పురుషార్ధం ముందుకు నడుస్తుంది .

54.  కమల పుష్ప సమానముగా అయ్యే పురుషార్ధం చెయ్యాలి .

55.  బాబాతో ఆడుకునే అనుభూతిని ఒక్క సంగమ యుగంలోనే ప్రప్తించే అత్బుతమైన సువర్ణ అవకాశము అందువలన బాబాతో అందరూ ఆత్మిక  స్థితిలో బాబాతో ఆడుకునే అనుభూతిని పొందటం వలన కూడా మన పురుషార్ధం ముందుకు వెళ్ళుతుంది .

56.  బ్రహ్మ బాబా బృహుటి స్థానములో చూస్తూ శక్తిని తీసుకుంటూ , ఎవరిని చూడకుండా బాబా అడుగులో అడుగు నిమితంగా  వేయటము వలన మన పురుషార్ధం ముందుకు వెళ్ళి పోతుంది .

57.  స్వయాన్ని కుంభ కర్ణ నిద్ర నుంచి జాగృతo చేసుకుంటే మనకు తెలియకుండానే విశ్వానికి సేవాధారి ఆత్మగా తయారు అయ్యిపోతాము .

58.  కళ్ళకు కనిపించినవి అన్ని నిజాలు అని అనుకోక , మనో నేత్రముతో సత్యాన్ని గ్రహించినట్టు అయితేనే మన పురుషార్ధం తీవ్ర తరము అవుతుంది .

59.  సదా డబల్ లైట్ స్వరూపమును ధారణ చెయ్యాలి .

60.  మామ్మ ఎలాగా అయితే స్వమానములో స్థితులై వుండే వారో ఆ విధంగా మనము ధారణ చెయ్యాలి.

61.  నష్టమోహ స్మృతిలో వుండాలి .

62.  పరిస్థ స్వరూపమును ధారణ చెయ్యాలి .

63.  ఆది స్వరూపములో  స్థితులై వుండాలి .

64.  ప్రతి సెకను ఇది నా అంతిమ సమయం అని అనుకుంటూ మమ్మ ఎలాగయితే అనుకుని పురుషార్ధం చేసేవారో , అదే విధముగా మనము కూడా చేసుకోవాలి .

65.  సంగమ యుగి పురుషోత్తమ బ్రహ్మణ స్వరూప ఆత్మగా   స్థితులై వుండాలి.

66.  కలిగిన నష్టం లోనూ బాబాకు ధన్యవాదాలు తెలియచేయటం వలన కూడా మన పురుషార్ధం ముందుకు వెళ్ళుతుంది .

67.  ఈ సంగమ యుగంలో పురుషార్ధం చేసుకోక పోతే , ఇంక ఎప్పుడు పురుషార్ధం చేసుకోలేము , నా రచనను చేసుకునే అవకాశము ఒక్క సంగమ యుగంలోనే వుంది అని తెలుసుకోవాలి దాని వలన మన పురుషార్ధం ముందుకు వెళ్ళుతుంది .

68.  ఆత్మకు భోజనము మురళీ , మురళీలో ముఖ్యమైన పాయింట్స్ ని మనన చింతన చేయటం వలన కూడా పురుషార్ధం ముందుకు వెళ్ళుతుంది . ( బ్రతకటానికి ఒక్క రొట్టె ముక్క చాలు అని బాబా ఆదిలో చెప్పిన విషయం మర్చిపోవద్దు. )

69.  ప్రతి నిమిషం నేను రాజ యోగి ఆత్మను అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి .

70.  ఆత్మిక దృష్టి , ఆత్మిక భావన ఫై మనస్సును లగ్నం చెయ్యాలి . అప్పుడే మనము ఆత్మాభిమానములో వెళ్ళి పురుషార్ధంను తీవ్రంగా చెయ్యగలము  .

71.  సూక్ష్మ – స్థూల వైద్యమును అందరికి అందించటం వలన కూడా పురుషార్ధం వేగవంతము అవుతుంది .

72.  చేసిన పొరపాట్లను బాబా దగ్గర ఏది దాచకుండా చెప్పడం వలన కూడా పురుషార్ధం వేగవంతము అవుతుంది .

73.  సర్వుల పై దయ భావన , సమ భావన ఏర్పాటు చేసుకోవటం వలన కూడా పురుషార్ధం వేగవంతము అవుతుంది .

74.  వినాశనము మరియు స్థాపన రెండు స్థితుల కార్యములను బాలన్స్ చేసుకోవడం వలన కూడా పురుషార్ధం తీవ్ర తరము అవుతుంది .

75.  నిరంతర యోగి జీవితమును గడపటం వలన కూడా పురుషార్ధంను ముందుకు తీసుకువెళ్ళవచ్చు .

76.  బ్రాహ్మణ జీవితంనకు వున్న 4 ఆధారములు సమ పాళ్ళలో వున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి . 1. పరమాత్మ జ్ఞాని ఆత్మ 2. సహజ రాజ యోగి ఆత్మ 3. దివ్య గుణధారీ 4. విశ్వ సేవాధారి.

77.  ప్రతి నిమిషము నేను ఈశ్వరీయ విద్యార్ధిని నాకు తండ్రి అవినాశి జ్ఞాన రత్నాలను పొందటానికి చదువును చదివిస్తున్నారు . నేను బాగా చదువుకోవాలి అన్న తపనను మనలో పెంచుకోవటం వలన కూడా పురుషార్ధం ముందుకు వెళ్ళుతుంది .

78.  సేవకు వున్న మరొక విధి నిస్వార్థ భావము అన్న బీజమును నాటుకోవటం వలన కూడా పురుషార్ధం ముందుకు వెళ్ళుతుంది .

79.  బ్రాహ్మణ ఆత్మలు అంటేనే దుఖ హర్త – సుఖ కర్త అన్న విషయాన్ని గురుతు చేసుకోవటం వలన కూడా పురుషార్ధం ముందుకు వెళ్ళుతుంది.

80.  డబల్ ఫాలో అని అనుకుంటూ ప్రతి సమయాన్ని , ప్రతి కార్యాన్ని ప్రారంభం చేసేటప్పుడు నిమిత్తం , నిర్మాణము మరియు నిర్మల వాణి అనే మూడు శబ్దంలను మర్చిపోకుండా గుర్తు చేసుకోవటం వలన కూడా పురుషార్ధం ముందుకు వెళ్ళుతుంది .

81.  తీవ్ర పురుషార్ధంనకు బ్రాహ్మణులకు సదా జతలో వున్న 3 విషయాలు 1. విచారము 2. వివేకము 3.అనుభవము అనేవి సాధనములుగా ఉపయోగ పడతాయి .

82.  ఆత్మ స్వయాన్ని ఆశరీరిగా భావించి కర్మేద్రియ జీత్ , మాయా జీత్ మరియు ప్రకృతి జీత్ గా అనుభవము చేయటం వలన కూడా పురుషార్ధంను ముందుకు సాగించవచ్చు .

 83.  స్వరాజ్య అధికారి ఆత్మగా మారాలి . 

84.  వ్యక్తం లో అవ్యక్త స్థితి ని అనుభవం చేసుకోవాలి 

85.  స్వపరివర్తన విశ్వ పరివర్తన


Spiritual Effort (Purusharth) – Key Points in English

  1. Always remain in the stage of a detached observer (witness consciousness). In this lies the secret of dharma and happiness.
  2. The feeling “I am just an instrument” helps progress in spiritual effort.
  3. Repeatedly write and remind yourself: “I am a soul” – this leads to soul-consciousness.
  4. Never forget to follow the Father (Follow Father).
  5. Keep only one awareness in your intellect: “I and my Baba”.
  6. Follow Shrimat (God’s directions) and develop a pure, elevated intellect. See the incorporeal through the corporeal teacher.
  7. Focus on service through thoughts (Manasa Seva) and improving your inner stage.
  8. Don’t stop by seeing others get tired or go ahead. Avoid comparison. Focus on self-progress, not others.
  9. Keep your life goal as returning to the soul world (home).
  10. Always remain ever-ready.
  11. Everyone has their own role. Move forward with knowledge (sword) and remembrance (shield).
  12. Have firm faith in the Father.
  13. Practice stability (equanimity) and solitude.
  14. Don’t run behind temporary wealth. Seek imperishable spiritual wealth (knowledge) and remain content.
  15. Realize deeply: I am a point (soul), God is a point, drama is also precise.
  16. Remember nature in two forms: point and light.
  17. Focus on completing your own spiritual tasks, not others’.
  18. Practice becoming bodiless (ashariri stage).
  19. Develop the stage of victory over Maya (Mayajeet).
  20. Remind yourself: I am not the body, I am an eternal conscious soul.
  21. Stay content within; without contentment, yoga is not possible.
  22. Remain in the awareness: I am a world-benefactor soul.
  23. Let your vision spread God’s message.
  24. Connect all your relationships only with the Supreme Soul.
  25. Accept everything as “Nothing new” and say: Wah Drama, Wah Baba.
  26. Stay unshakable and stable.
  27. Practice intense spiritual effort (Tapasya) with visible contentment.
  28. End unnecessary questions like “why, what, should” to maintain control.
  29. Check your purity and contentment in all relationships.
  30. Experience yourself as a faithful and victorious soul.
  31. Practice being incorporeal, egoless, and pure.
  32. Maintain a spiritual smile and sweet speech always.
  33. Have pure feelings and good wishes for all.
  34. Fill yourself with divine virtues and powers.
  35. Sacrifice even the ego in the fire of spiritual effort.
  36. Stay introverted (introspective) most of the time.
  37. Wear only the garland of knowledge and virtues, not worldly attachments.
  38. Experience power through silence and remembrance.
  39. Check three certificates: self-contentment, God’s satisfaction, others’ satisfaction.
  40. Live in the body but experience the avyakt (subtle) stage.
  41. Experience ever healthy, wealthy, and happy state internally.
  42. Have faith in God, self, drama, and spiritual family.
  43. Become a world emperor by renunciation, tireless service, and detachment.
  44. Sit on the immortal throne (soul-conscious stage).
  45. Keep your thoughts pure and beneficial.
  46. Remain humble even in insult or criticism.
  47. Balance all four: knowledge, yoga, dharna, service.
  48. Practice early morning spiritual connection (Amritvela).
  49. Become a lighthouse and might-house.
  50. Use your power to defeat Maya, not people.
  51. Maintain simplicity and tolerance.
  52. Remove weaknesses through remembrance of God.
  53. Practice roles of creator (Brahma), sustainer (Vishnu), transformer (Shankar) internally.
  54. Be like a lotus – detached in the world.
  55. Experience divine companionship with God.
  56. Follow Brahma Baba’s footsteps with focus and discipline.
  57. Awaken from spiritual sleep (ignorance).
  58. Don’t believe only what you see; use inner vision.
  59. Remain double light (light + no burden).
  60. Stay in self-respect.
  61. Practice detachment (free from attachment).
  62. Stay beyond situations (detached observer).
  63. Remain in your original pure stage.
  64. Live every second as your last moment.
  65. Stay as a highest Brahmin soul of the Confluence Age.
  66. Be grateful to God even in loss.
  67. Understand this is the only time for spiritual transformation.
  68. Study and churn Murli (spiritual knowledge) daily.
  69. Remember always: I am a Rajyogi soul.
  70. Keep your mind focused on soul-conscious vision.
  71. Serve others through subtle and physical healing.
  72. Be honest with God about your mistakes.
  73. Have compassion and equality for all.
  74. Balance destruction of negativity and establishment of virtues.
  75. Live a constant yogic life.
  76. Maintain balance of: knowledge, yoga, virtues, service.
  77. Be an elevated spiritual student eager to learn.
  78. Do service with selfless intention.
  79. Remember: you are a remover of sorrow, giver of happiness.
  80. Practice double follow with humility and purity in speech.
  81. Use reflection, discrimination, and experience in effort.
  82. Experience victory over senses, Maya, and nature.
  83. Become a self-sovereign (master of self).
  84. Experience the avyakt stage while living in the physical world.
  85. Self-transformation leads to world transformation

आध्यात्मिक पुरुषार्थ (Spiritual Effort) – मुख्य बिंदु

  • हमेशा साक्षी भाव (Detached Observer) में रहें – यही धर्म और सुख का रहस्य है।
  • “मैं केवल एक निमित्त हूँ” यह भावना पुरुषार्थ में प्रगति कराती है।
  • बार-बार लिखें और याद दिलाएं: “मैं आत्मा हूँ।”
  • सदा “Follow Father” का पालन करें।
  • अपने बुद्धि में केवल एक ही स्मृति रखें: “मैं और मेरे बाबा।”
  • श्रीमत (ईश्वर के निर्देश) पर चलें और श्रेष्ठ बुद्धि विकसित करें। साकार में निराकार को देखें।
  • मनसा सेवा (विचारों द्वारा सेवा) और अपनी आंतरिक स्थिति सुधारने पर ध्यान दें।
  • दूसरों से तुलना न करें; स्वयं की प्रगति पर ध्यान दें।
  • जीवन का लक्ष्य आत्मलोक (घर) वापसी रखें।
  • हमेशा “Ever-ready” रहें।
  • हर किसी का अपना-अपना पार्ट है; ज्ञान (तलवार) और योग (ढाल) के साथ आगे बढ़ें।
  • परमात्मा पर अटल विश्वास रखें।
  • स्थिरता (Equanimity) और एकांत का अभ्यास करें।
  • नाशवान धन के पीछे न भागें; अविनाशी आध्यात्मिक धन (ज्ञान) प्राप्त करें।
  • गहराई से समझें: मैं बिंदु (आत्मा) हूँ, परमात्मा भी बिंदु है, ड्रामा भी सटीक है।
  • प्रकृति को दो रूपों में याद रखें: बिंदु और प्रकाश।
  • अपने पुरुषार्थ पर ध्यान दें, दूसरों के काम में न पड़ें।
  • अशरीरी (bodiless) अवस्था का अभ्यास करें।
  • माया पर विजय (मायाजीत) अवस्था विकसित करें।
  • स्वयं को याद दिलाएं: मैं शरीर नहीं, मैं शाश्वत आत्मा हूँ।
  • संतुष्टि में रहें; बिना संतुष्टि योग संभव नहीं।
  • स्मृति रखें: “मैं विश्व-कल्याणकारी आत्मा हूँ।”
  • आपकी दृष्टि से ईश्वर का संदेश फैलना चाहिए।
  • सभी संबंध केवल परमात्मा से जोड़ें।
  • हर परिस्थिति को स्वीकार करें: “Nothing new – Wah Drama, Wah Baba।”
  • अडिग और स्थिर रहें।
  • तपस्या के साथ गहन पुरुषार्थ करें और संतुष्टि दिखाएं।
  • “क्यों, क्या, कैसे” जैसे अनावश्यक प्रश्न छोड़ दें।
  • सभी संबंधों में पवित्रता और संतुष्टि की जांच करें।
  • स्वयं को विजयी और वफादार आत्मा अनुभव करें।
  • निराकार, निरहंकारी और पवित्र बनने का अभ्यास करें।
  • हमेशा मधुर वाणी और आध्यात्मिक मुस्कान रखें।
  • सबके लिए शुभभावना और शुभकामना रखें।
  • दिव्य गुण और शक्तियों से स्वयं को भरें।
  • अहंकार को भी पुरुषार्थ की अग्नि में अर्पण करें।
  • अधिकतर समय अंतर्मुखी रहें।
  • ज्ञान और गुणों की माला पहनें, आसक्ति की नहीं।
  • मौन और स्मृति से शक्ति का अनुभव करें।
  • तीन प्रमाणपत्र चेक करें:
    ✔ स्वयं की संतुष्टि
    ✔ परमात्मा की संतुष्टि
    ✔ दूसरों की संतुष्टि
  • शरीर में रहते हुए भी अव्यक्त अवस्था का अनुभव करें।
  • अंदर से सदा स्वस्थ, सम्पन्न और खुश रहें।
  • परमात्मा, स्वयं, ड्रामा और परिवार पर विश्वास रखें।
  • त्याग, सेवा और वैराग्य से विश्व सम्राट बनें।
  • आत्म-स्मृति के अमर सिंहासन पर बैठें।
  • विचारों को शुद्ध और कल्याणकारी रखें।
  • अपमान या आलोचना में भी विनम्र रहें।
  • ज्ञान, योग, धारणा, सेवा – चारों का संतुलन रखें।
  • अमृतवेला में ध्यान का अभ्यास करें।
  • लाइटहाउस और माइटहाउस बनें।
  • अपनी शक्ति का उपयोग माया को हराने में करें, लोगों को नहीं।
  • सरलता और सहनशीलता बनाए रखें।
  • परमात्मा की याद से कमजोरियों को समाप्त करें।
  • ब्रह्मा (सृजन), विष्णु (पालन), शंकर (परिवर्तन) – इन भूमिकाओं का अभ्यास करें।
  • कमल के समान बनें – दुनिया में रहते हुए भी अलग।
  • परमात्मा के साथ दिव्य संग का अनुभव करें।
  • ब्रह्मा बाबा के कदमों का अनुसरण करें।
  • अज्ञान की नींद से जागें।
  • केवल देखने पर विश्वास न करें; आंतरिक दृष्टि का उपयोग करें।
  • डबल लाइट रहें (हल्के और बिना बोझ के)।
  • स्वमान में रहें।
  • आसक्ति से मुक्त रहें।
  • परिस्थितियों से ऊपर रहें।
  • अपने मूल पवित्र स्वरूप में स्थित रहें।
  • हर क्षण को अंतिम क्षण की तरह जिएं।
  • संगम युग के श्रेष्ठ ब्राह्मण आत्मा बनें।
  • हानि में भी परमात्मा का धन्यवाद करें।
  • समझें – यही समय है आत्म-परिवर्तन का।
  • रोज मुरली पढ़ें और मनन करें।
  • सदा याद रखें: “मैं एक राजयोगी आत्मा हूँ।”
  • आत्म-स्मृति में स्थित रहें।
  • सूक्ष्म और स्थूल सेवा करें।
  • अपनी गलतियों को परमात्मा के सामने ईमानदारी से स्वीकार करें।
  • सबके प्रति करुणा और समान दृष्टि रखें।
  • नकारात्मकता का अंत और गुणों की स्थापना करें।
  • निरंतर योगयुक्त जीवन जिएं।
  • ज्ञान, योग, गुण, सेवा – संतुलन बनाए रखें।
  • एक श्रेष्ठ विद्यार्थी बनें, सीखने की इच्छा रखें।
  • निःस्वार्थ सेवा करें।
  • याद रखें: आप दुख हरने वाले, सुख देने वाले हैं।
  • नम्रता और पवित्रता के साथ डबल फॉलो करें।
  • विवेक, अनुभव और चिंतन से पुरुषार्थ करें।
  • इंद्रियों, माया और प्रकृति पर विजय प्राप्त करें।
  • स्वयं के स्वामी (Self-sovereign) बनें।
  • साकार में रहते हुए अव्यक्त अवस्था का अनुभव करें।

🌿 निष्कर्ष

Self Transformation = World Transformation
(स्व-परिवर्तन से ही विश्व परिवर्तन संभव है)